ప్రెస్ రిలీజ్-ఆహ్వానం

డా . గోపాల్ రెడ్డి (9849642868)
ప్రెసిడెంట్

ఆయుష్ నడింపల్లి (9848038857)
సెక్రటరీ

ప్రెస్ రిలీజ్

1 నవంబర్ 2018

హైదరాబాద్ : సమాచార భారతి సాంస్కృతిక సంస్థ “2వ కాకతీయ ఫిలిం ఫెస్టివల్ ” పేరుతో లఘు చిత్రాల ప్రదర్శన ను 22 డిసెంబర్ నాడు నిర్వహిస్తోంది. భారతీయత కు పునాదులు అయిన సామాజిక భాధ్యత, కుటుంబ విలువలు, సామాజిక విలువలు పెంపొందించటం ఈ పోటీ యొక్క ముఖ్య ఉద్దేశం. నూతన చిత్ర దర్శకులకు తమ అభిప్రాయాలను లఘు చిత్రాల ద్వారా నలుగురికి తెలియజెప్పగలిగే గొప్ప అవకాశం ఇది. యువత యొక్క సృజనాత్మకతను వెలికితీసే వేదిక ఇది.

ఈ పోటీ కి పంపు చిత్రాలకు నిర్దేశించబడిన నేపధ్యాలు:

1. భారతీయ సంస్కృతి మరియు విలువలు

2. జాతీయ మరియు సామాజిక అవగాహన

3. మహిళా సాధికారత

4. నిర్మాణాత్మక పనులు

5. పర్యావరణం

ఈ లఘు చిత్రాల పోటీ కి ప్రవేశము ఉచితం .

యువతని ప్రోత్సహించేందుకు క్రింద చెప్పబడిన విభాగాలలో బహుమతులు కలవు :

ఉత్తమ లఘు చిత్రం: రూ . 51,000/-

రెండవ ఉత్తమ లఘు చిత్రం: రూ . 21,000/-

మూడవ ఉత్తమ లఘు చిత్రం: రూ . 11,000/-

ఈ ఏడాది కొత్త్తగా మరో రెండు విభాగాలు మొదలు పెట్టడం జరిగినది: డాక్యుమెంటరీ, క్యాంపస్ ఫిలిమ్స్

ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం: రూ . 21,000/-

ఉత్తమ క్యాంపస్ చిత్రం: రూ . 11,000/-

ఈ పోటీ కి పంపే చిత్రాలు తెలుగు, హిందీ లేదా ఇంగ్లీష్ భాషలలో తీయాలి. మూకీ చిత్రాలకు కూడా ప్రవేశం కలదు. లఘు చిత్రాల యొక్క నిడివి 20 నిముషాలు, డాక్యుమెంటరీ చిత్రాల నిడివి 30 నిముషాలు మించరాదు. పోటీ కి పంపే చిత్రాలు జనవరి 2018 నుండి నవంబర్ 30 లోపు తీసిన సొంతవి అయి ఉండాలి. వీటిని హెచ్ డి (HD) ఫార్మాట్ లో అందివ్వాల్సి ఉంటుంది. చిత్రాలను పంపుటకు ఆఖరు తేదీ 30 నవంబర్ 2018.

ఎంపిక చేయబడిన చిత్రాలు 22 డిసెంబర్ 2018న ప్రదర్శింపబడతాయి.

ఫిలిం ఫెస్టివల్ వెబ్ సైట్ : http://kakatiyafilmfestival.com

మరిన్ని వివరాల కోసం :

ఎస్ చంద్రశేఖర్, 7680884181 (ఫోన్)

కన్వీనర్ , కాకతీయ ఫిలిం ఫెస్టివల్

సమాచార భారతి కల్చరల్ అసోసియేషన్

3-4-852, కేశవ నిలయం, బర్కత్ పుర, హైదరాబాద్ – 500027

ఫోన్ : 040- 27550869; ఈ -మెయిల్ : kakatiyafilmfestival@gmail.com

Leave a Reply