Kakatiya Film Festival
Hyderabad
Samachara Bharati Cultural Association organised “Kakatiya Film Festival”, a short film festival on the theme “Ek Bharat, Samaras Bharat” on 17 December 2016 at Sarathi Studios, Ameerpet, Hyderabad and awarded the prizes to best short movies.
Speaking at the award ceremony, the chief guest Sri Raj Kandukuri garu said that his recent film “Pelli Choopulu” was directed by an erstwhile short film director Sri Arun Bhaskar. He mentioned that he plans to introduce atleast one short film maker per year into mainstream movies. He congratulated the organisers of Samachara Bharati for the efforts in organising the Kakatiya Film Festival.
The Chief speaker Dr.Annadanam Subramaniam garu, Jt.Secretary of Rashtriya Swayamsevak Sangh spoke about the extremely important role that Short film makers have in spreading positive thoughts, ideas and building a positive Bharat.
The jury members Sri Allani Sridhar, Sri Shekkar Suri, Sri Sumanth Paranji and Sri Vinay Varma, gave their valuable suggestion and inputs on film making to the aspiring film makers.
Over 120 participants attended this event and were given an opportunity to interact with the jury.
Prizes :
Movie titled ‘Behind the Smile’ that subtly dealt with problems faced by girl students due to lack of toilets in schools directed by M. Shankar Raju won the first prize
Sri Shiv Kumar bagged the second prize for ‘Gurukulam’ that highlighted the importance of application of education rather than mere marks oriented education.
Sri Durga Prasad Chinni won third prize for heart touching portrayal of a dumb man working as a chaiwala who saves tips earned to support education of poor children in his village. A short film, Rythu, in which a student despite being highly qualified chooses to become a farmer won accolades from jury and bagged special prize.Another short film Addilu received special accolades from the jury.
సమాజాన్ని సంఘటితం చేసే లఘు చిత్రాలు రూపుదిద్దుకోవాలి
కాకతీయ ఫార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డుల ప్రదానోత్సవంలో డా. అన్నదానం సుబ్రహ్మణ్యం
‘ఏక్ భారత్, సమరస భారత్’ నినాదంతో సమాచార భారతి కల్చరల్ అసోసియేషన్ నిర్వహించిన ‘కాకతీయ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్’ అవార్డుల ప్రదానోత్సవం శనివారం సాయంత్రం సారథి స్టూడియోస్ లో ఘనంగా జరిగింది. ఆర్.ఎస్.ఎస్. అధికారి శ్రీ అన్నదానం సుబ్రహ్మణ్యం ఈ కార్యక్రమానికి విశిష్ఠ అతిథిగా హాజరై తన సందేశాన్ని అందించారు. ప్రసార, ప్రచార మాధ్యమాల ద్వారా సమాజానికి ఉపయోగపడే అంశాలను, సంఘటితం చేసే విషయాలను ప్రజలకు అందించాలని కోరారు. లఘు చిత్రాలను రూపొందించే యువత ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే సమాజానికి మేలు చేసిన వారు అవుతారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శక నిర్మాత రాజ్ కందుకూరి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇటీవల తాను నిర్మించిన ‘పెళ్ళిచూపులు’ చిత్రంతో షార్ట్ ఫిల్మ్ మేకర్ తరుణ్ భాస్కర్ ను దర్శకుడిగా పరిచయం చేశానని, అలానే ప్రతి యేడాది ఒకరిని పరిచయం చేయాలనుకుంటున్నానని అన్నారు. కాకతీయ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొన్న ఔత్సాహికులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ లఘు చిత్రోత్సవంలో శంకర్రాజు రూపొందించిన ‘బిహైండ్ ద స్మైల్’ ప్రధమ, శివకుమార్ బి.వి.ఆర్. రూపొందించిన ‘గురుకులం’ ద్వితీయ, దుర్గాప్రసాద్ రూపొందించిన ‘చాయ్ చోటు’ తృతీయ బహుమతులకు ఎంపికయ్యాయి. ఎం. శంకర్రాజు రూపొందించిన ‘రైతు’ లఘు చిత్రం స్పెషల్ జ్యూరీ అవార్డుకు ఎంపికయ్యింది. ‘సమరసత’, ‘సేవ’, ‘జాగరుకత’ అనే అంశాలపై తొలియత్నంగా తాము నిర్వహించిన కాకతీయ లఘు చిత్రోత్సవం విజయవంతం కావడం పట్ల అధ్యక్ష, కార్యదర్శులు గోపాల్ రెడ్డి, ఆయుష్ నడింపల్లి హర్షం వ్యక్తం చేశారు. ఈ చిత్రోత్సవానికి అల్లాణి శ్రీధర్, ‘మధుర’ శ్రీధర్ రెడ్డి, సుమంత్ పరాంజి, శేఖర్ సూరి, వినయ్ వర్మన్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.